10-09-2025 12:33:33 AM
సిద్ధిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 9:ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ మాండలికంలో రచనలు చేస్తూ ప్రజలకు చైతన్యం నింపిన కాళోజీ సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదు అందించిందని, ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నాగరాజమ్మ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య తదితరులుపాల్గొన్నారు.