calender_icon.png 10 September, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచి ప్రమాదంపై రౌండ్‌టేబుల్ సమావేశం

10-09-2025 12:35:21 AM

-బాధితులకు రూ.కోటి పరిహారం, బాధ్యులపై చర్యలకు డిమాండ్

- రాష్ట్రంలోని ఫార్మా కంపెనీల్లో భద్రతపై కఠినంగా వ్యవహరించాలి

- ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం

సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి)/ పటాన్చెరు :సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఘటనలో చనిపోయిన, గాయ పడిన, గల్లంతైన కార్మికుల కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మేధావు లు, కార్మిక నాయకులు, ఉద్యమకారులు డిమాండ్ చేశారు.

సిగాచి ఘటనలో బాధితులకు అందాల్సిన పరిహారం విషయంలో విజయక్రాంతి దినపత్రికలో పలు కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేర కు మేధావులు, కార్మిక, ఉద్యమకారులు స్పందించారు. ఈ మేరకు మంగళవారం నా డు పటాన్చెరు మండలం ముత్తంగిలోని పీ ఎస్‌ఆర్ గార్డెన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి టీపీజేఏసీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ వై.అశోక్ కుమార్ అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

వక్తలు ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్లోని అంశాలను తీవ్రంగా విశ్లేషించారు. ప్రభుత్వం వ్యవస్థాగత లోపాలను అంగీకరించిన నేపథ్యంలో తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు కోరారు. అందులో ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కోటి రూపాయల పరిహారంలో భాగంగా మిగిలిన రూ.75 లక్షల పరిహారా న్ని వెంటనే బాధిత కుటుంబాలకు ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేశారు.

పేలు డు ఘటనలో గాయపడిన వారికి కూడా నష్టపరిహారాన్ని రూ. 25 లక్షలకు పెంచాలని, వారి దీర్ఘకాలిక వైద్య చికిత్స ఖర్చులను పూర్తిస్థాయిలో కంపెనీయే భరించాలన్నారు. మరణించిన, గాయపడిన కార్మికుల పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్యను అందించేలా ప్ర భుత్వం హామీ ఇవ్వాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రతి నెలా పెన్షన్గా మరణించిన కార్మికుడి నెల వేతనాన్ని అందించాలని, చనిపోయిన, గల్లంతైన కార్మికులందరికీ వెంటనే డెత్ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 

దర్యాప్తు, బాధ్యులపై చర్యలు...

సిగాచి ఘటన కేసు దర్యాప్తును ఒక ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన కంపెనీ యాజమాన్యంతో పా టు, భద్రతా నిబంధనలను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ అధికా రులపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలోని అన్ని ఫార్మా కంపెనీలలో భద్రతను పర్యవేక్షించడానికి ఒక కఠినమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, భద్రతా లోపాలు ఉన్న కంపెనీలపై భారీ జరిమానాలు విధించాలని తీ ర్మానించారు. ప్రమాదకర పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు సరైన భద్రతా శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, కంపెనీలలో జరిగే తనిఖీలను పారదర్శకంగా నిర్వహించి, నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. 

ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే మరింత తీవ్రమైన ఉద్యమాలను చేపడతామని రౌండ్టేబుల్ సమావేశం హెచ్చరించిం ది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండ రాం, రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ కలపాల బాబురావు, హైకోర్టు న్యాయవాది వసుధ నాగరా జ్, ఎంవిఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకటరెడ్డి, టిపిజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి, ఏపీసిఆర్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఉస్మాన్, మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వ ర్గీస్, పర్యావరణ వేత్త డాక్టర్ నారాయణరావు, హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర నాయకుడు శ్రీ కాంత్, హెచ్ ఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈ శ్వర్ ప్రసాద్, ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె. నరసింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు శివ శంకర్ రావు, సిఐటీ యూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్యం, సిపిఐ పార్టీ సీనియర్ నా యకులు ప్రకాష్ రావు, ట్రేడ్ యూనియన్ నాయకుడు గోవర్ధన్, యువ న్యాయవాది మెట్టు శ్రీధర్, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోయిని ప్రసాద్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.