07-12-2025 07:21:50 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ లోని దాసారం బస్తీలో శ్రీనివాస్, కృష్ణ, నవీన్ ల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అయ్యప్ప స్వామికి పూజ నిర్వహించిన అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ పార్టీ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పుట్టల శేఖర్, బాలరాజ్, కూతురు నర్సింహ, బలరాం, గుడిగే శ్రీనివాస్ యాదవ్, ఆకుల రాజు, తదితరులు ఉన్నారు.