15-08-2025 08:52:09 AM
సనత్‌నగర్, (విజయక్రాంతి): ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న వారికి సకాలంలో సరైన వైద్యం అందించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) అన్నారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో బన్సీలాల్ పేట డివిజన్ సీసీ నగర్ కు చెందిన మల్లేష్ కు చికిత్స కోసం 3.50 లక్షల రూపాయలు, బేగంపేట డివిజన్ లోని పాటిగడ్డ కు చెందిన జమున కు గుండె సంబంధ చికిత్స కోసం 80 వేల రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాగా, మంజూరు పత్రాలు (LOC) లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా మెరుగైన వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, మహేష్ యాదవ్, కుమార్ యాదవ్, కిషోర్, ఆరీఫ్, జనార్దన్ తదితరులు ఉన్నారు.