calender_icon.png 15 August, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్: ముగ్గురిపై కఠిన చర్యలు

15-08-2025 09:01:04 AM

సనత్‌నగర్,(విజయక్రాంతి): మంగళవారం ఉదయం సంజీవ్ రెడ్డి నగర్ రోడ్ నుంచి మైత్రివన్ రోడ్ వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ రాంబాబు బృందం డ్రింక్ & డ్రైవ్‌లో ముగ్గురిని పట్టుకుంది.పట్టుబడిన ముగ్గురూ రెండోసారి మద్యం సేవించి వాహనం నడిపినవారే కావడంతో, ఒక్కొక్కరికి ₹3,300 జరిమానా విధించడంతో పాటు, ఒక రోజు సామాజిక సేవ చేయాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు.ప్రమాదాలను నివారించేందుకు మద్యం సేవించి వాహనం నడపవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.