calender_icon.png 15 August, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మువ్వన్నెల్లో మురిసిపోతున్న నాగార్జునసాగర్‌

15-08-2025 08:46:48 AM

  1. జాతీయ జెండాను తలపించేలా కృష్ణమ్మ పరవళ్లు
  2. జెండా రంగులతో సాగర్ నీటి ప్రవాహం 
  3. సాగర్ ప్రాజెక్టు 26 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
  4. సాగర్ జలాశయానికి 1,72,774 క్యూసెక్కుల వరద నీరు 
  5. 587.40.అడుగుల వద్ద జలాశయం నీటి మట్టం
  6. స్వల్పంగా తగ్గిన వరద ఉదృక్తి.. తగ్గని పర్యాటకుల సందడి

నాగార్జునసాగర్: విజయక్రాంతి: స్వతంత్ర దినోత్సవాన్ని(Indian Independence Day) పురస్కరించుకొని నాగార్జునసాగర్ డ్యామ్(Nagarjuna Sagar Dam)కు జాతీయ జెండాను ప్రతిబింబించేలా మూడు రంగుల రూపంలో ఆకర్షణయంగా కనిపించేలా విద్యుత్ బల్బులను పెట్టి సుందరంగా తీర్చిదిద్దారు.మువ్వన్నెల జెండా రంగులతో సాగర్ డ్యాం ఆకర్షణీయంగా మారడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారత స్వతంత్ర దినోత్సవంలో భాగంగా నాగార్జున సాగర్ త్రివర్ణ శోభను సంతరించుకుంది. వరద ప్రవాహంతో 26 క్రష్ గేట్ల నుంచి విడుదలైన నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు ముగ్ధమనోహరంగా ఉన్నాయి. దీనికి తోడు అధికారులు మువ్వన్నెల పతాకాన్ని తలపించే విధంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడంతో సాగర్ ప్రాజెక్టు మరింత అందంగా మారింది. రాత్రివేళల్లో మూడు రంగుల్లో కిందికి జాలువారుతున్న నీటితో సాగర్ అందాలు చూసేందుకు వేయికళ్లైనా సరిపోవంటే అతిశయోక్తి కాదేమో నాగార్జున సాగర్ ప్రాజెక్టును అధికారులు విద్యుత్ కాంతులతో నింపారు. 26 క్రష్ గేట్ల నుంచి విడుదలైన నీటి సోయగాలపై మువ్వన్నెల పతాకాన్ని తలపించే విధంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులను సాగర్ అందాలు అబ్బురపరుస్తున్నాయి

నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద వరద ఉదృక్తి కొనసాగుతుంది.శ్రీశైలం జలాశయం నుండి 1,72,774  క్యూసెక్కుల వరద ఉధృక్తి కొనసాగుతుండటంతో  డ్యామ్ అధికారులు 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,03,502 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు.ఎగువ నుండి వరద నీరు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో గురువారం మధ్యాహ్నం 8గేట్లను 10 అడుగుల నుండి5అడుగులకు కుదించడం జరిగింది. దీనితో నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి  నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 587.40 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 305.7464 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,576 క్యూసెక్కుల నీటిని,కుడి కాలువ ద్వారా 1540 క్యూసెక్కుల నీటిని,ఎడమ కాల్వద్వార నీటివిడుదల లేదు.,ఎస్.ఎల్.బి.సి ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని,లోలేవల్ కెనాల్ ద్వారా నీటి విడుదల లేదు.రిజర్వాయర్ నుండి మొత్తం 2,36,958 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పర్యటకుల సందడి.. 

నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో సాగర్ నిండుకుండలా మారి, ఆహ్లాదం పంచుతోంది. ఇటు గేట్ల నుంచి పాలధారల్లా దూకుతున్న కృష్ణమ్మ కనువిందు చేస్తోంది. మరో దిక్కు సాగర్ సమీపంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం సందర్శకుల మదిని దోచుకుంటోంది. సహజ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ‌కృష్ణమ్మ పరవళ్ల సుందర దృశ్యాలు నాగార్జునసాగర్‌ డ్యాం క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో ఆ జలదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అదేవిధంగా లాంచీ స్టేషన్ వద్ద,కొత్త బ్రిడ్జి,పాత వంతెన,డ్యామ్ ఎంట్రన్స్ భాగంలో పర్యాటకుల సందడి వాతావరణం నెలకొంది.దాంతో డ్యాం పరిసరాలు పర్యాటకులతో సందడిగా మారాయి.