20 July, 2026 | 9:26 PM

మహంకాళి, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని

20-07-2026 02:42 AM

సికింద్రాబాద్, జూలై 19 (విజయక్రాంతి): మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మోండా డివిజన్ ఆదయ్య నగర్ లో గల 18 టెంపుల్స్ లో బోనాల సందర్భంగా నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారు, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలతో ఆప్రాంతమంత సందడిగా మారింది.

పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోనాల శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆలయ నిర్వాహకులు ఏకాంబరం, సాయిబాబా, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్, రాములు, భాస్కర్, రాజు,నాయకులు శ్రీకాంత్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.