అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలకు చర్యలు తీసుకోండి
మంత్రి సీతక్కను కలిసి ఎమ్మెల్యే బొజ్జు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో నివసించే ప్రజల రవాణా కష్టాలు తొలగేలా స్టీల్ బ్రిడ్జి నిర్మాణనికి తగు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మంత్రి సీతక్క ను కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో మంత్రి సీతక్క ను కలిసి వినతి పత్రం అందజేసి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గ పరిధిలోని ఉట్నూర్, పెంబి మండలాల్లో మొత్తం 6 బ్రిడ్జిల నిర్మాణనికి దాదాపు 17 కోట్ల 92 లక్షల రూపాయల వ్యయం అవుతుంది అని అంచనా వేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఏదైనా గ్రాంట్ ద్వారా ఆ మొత్తం నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క ను కోరినట్టు తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే నిధులు మంజూరు కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.






