17-11-2025 02:03:08 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రినగర్ హనుమాన్ దేవాలయ ప్రాంతంలో అయ్యప్ప స్వామి భక్తులందరి సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఈనెల 26 వ తేదీన అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం సందర్బంగా ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప భక్తులతో కలిసి సోమవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ సాయిరీ మహేందర్, ట్రస్టు గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి మురళీధర్, యంత్ర ప్రతిష్టాపకులు, ఆధర్వణ వేద పండితులు ఉప్పర మల్యాల లక్ష్మణ్ శర్మ, ఆలయ పురోహితులు, గూడ రమేష్ శర్మ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రెటరీ జైపాల్ రెడ్డి, ఆలయ చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న)తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, కాంగ్రెస్ నాయకులు, భక్త బృందం పాల్గొన్నారు.