17-11-2025 03:22:36 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్లో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉదయం నుంచి పత్తి జిన్నింగ్ మిల్లుల ఎలాంటి కొనుగోలు సందడి లేకుండా పోయింది. రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్1, ఎల్2, ఎల్ 3 సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధికంగా పత్తి కొనుగోలు నిలిపివేశారు.ప్రతి రోజు తెల్లవారుజాము నుంచి పత్తి వాహనాల సందడి ఉండేది.
సోమవారం వచ్చిన కొన్ని వాహనాలు సైతం వెనక్కి వెళ్లాయి.కాటన్ అసోసియేషన్ సభ్యులు జిన్నింగ్ మిల్లు గేటు మూసి నిరసన చేపట్టారు. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 సమస్యను పరిష్కారం అయ్యే వరకు సీసీఐ, ప్రైవేటులో నిరవధికంగా పత్తి కొనుగోళ్లు చేయమని స్పష్టం చేశారు. మిల్లులో నిబంధనలు లేకుండా సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోరాజేష్ కాకాని, మధుకర్, గురురాజ్ చిద్రవార్, జ్ఞానేశ్వర్, సుమిత్, గిరిష్, అక్షయ్ పాల్గొన్నారు.