calender_icon.png 17 November, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా 'నవీన్ యాదవ్' జన్మదిన వేడుకలు

17-11-2025 02:47:46 PM

మందమర్రి,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జన్మదిన వేడుకలు కురుమ సంఘం జిల్లా అధ్యక్షు లు, కాంగ్రెస్ నాయకులు,నవీన్ యాదవ్ ఆత్మీయ మిత్రులు గుంట శ్రీశైలం ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మనోవికాస్ పాఠశాల విద్యార్థుల సమక్షంలో సోమవారం ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు మిఠాయి, బ్లాంకెట్ లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుంట శ్రీశైలం మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, భవిష్యత్తు లో  ఉన్నత పదవులు అధిరో హించాలని ఆయన ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజకీయాల్లో స్థానిక నాయకునిగా ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ప్రజా ప్రతినిధిగా ఆయనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఆయన సేవలు జూబ్లీహిల్స్ నియోజక వర్గానికే కాకుండా బీసీ బిడ్డగా రాష్ట్ర వ్యాప్తంగా అందించాలని ప్రజ లు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, ఆకారం రమేష్, కత్తి రమేష్, అంకం రాజ్ కుమార్, బండి శంకర్, దాసరి క్రాంతి లు పాల్గొన్నారు.