17-11-2025 02:39:43 PM
సౌదీ ప్రమాద మృతులంతా హైదరాబాద్ వాసులే
సౌదీ బస్సు ప్రమాదంపై హజ్ కమిటీ ప్రకటన విడుదల
హైదరాబాద్: సౌదీ బస్సు ప్రమాదంపై హైదరాబాద్ హజ్ కమిటీ(Hyderabad Haj Committee) ప్రకటన విడుదల చేసింది. సౌదీ బస్సు ప్రమాదంలో(Saudi bus accident) 45 మంది చనిపోయారని హజ్ కమిటీ వెల్లడించింది. సౌదీ ప్రమాద మృతులంతా హైదరాబాద్ వాసులేనని హజ్ కమిటీ స్పష్టం చేసింది. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారని హజ్ కమిటీ వివరించింది. సోమవారం తెల్లవారుజామున మక్కా నుండి మదీనాకు యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 45 మంది ఉమ్రా యాత్రికులు మరణించారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనను దృష్టిలో ఉంచుకుని జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన భారతీయ ఉమ్రా యాత్రికులున్నారు.
"సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదంలో భారతీయ ఉమ్రా యాత్రికులు పాల్గొన్న సంఘటన దృష్ట్యా, జెడ్డాలో భారత కాన్సులేట్ జనరల్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. హెల్ప్‌లైన్ సంప్రదింపు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: 8002440003 (టోల్ ఫ్రీ) 0122614093 0126614276 0556122301 (వాట్సాప్)," అని కాన్సులేట్ జనరల్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

సౌదీ బస్సుప్రమాదంలో మరణించిన హైదరాబాద్ యాత్రికుల జాబితా..
రహమత్బీ (GHMC కాలనీ)
మరియం ఫాతిమా (ముషీరాబాద్)
సారా బేగం (కలాపతేర్)
షెహనాజ్ బేగం (ఆసిఫ్ నగర్)
షౌకత్ బేగం (ఆసిఫ్ నగర్)
మహమ్మద్ మౌలానా (జిర్రా)
సారా మహమూద్ అల్ అమౌదీ (ఆసిఫ్ నగర్)
షాజహాన్ బేగం (ఆసిఫ్ నగర్)
సలావుద్దీన్ షేక్ (రామ్‌నగర్)
మస్తాన్ మహమ్మద్ (ఫలక్‌నుమా)
జకియా బేగం (ఫలక్‌నుమా)
మహమ్మద్ అలీ (జిర్రా)
రహీం ఉన్నిసా (బాలానగర్)
గౌసియా బేగం (ఆసిఫ్ నగర్)
అక్తేర్ బేగం (కొత్త నల్లకుంట)
నసీరుద్దీన్ షేక్ (కొత్త నల్లకుంట)
అబ్దుల్ ఖదీర్ మహమ్మద్ (ఆసిఫ్ నగర్)
అబ్దుల్ షోబ్ మహ్మద్ (ఆసిఫ్ నగర్)
హుమేరా నజ్నీన్ (ఆసిఫ్ నగర్)
సబీహా సుల్తానా (లంగర్‌హౌస్)
శిరహట్టి అబ్దుల్ గని అహ్మద్ సాహెబ్ (హుబ్బిలి రూరల్)
రిజ్వానా బేగం (ముషీరాబాద్)
ఇర్ఫాన్ అహ్మద్ (లంగర్‌హౌస్)
పర్వీన్ బేగం (రాజేంద్ర నగర్)
సోహైల్ మహ్మద్ (వట్టేపల్లి)
షేక్ జైన్ ఉద్దీన్ (విద్యా నగర్)
ఫరానా సుల్తానా (కొత్త నల్లకుంట)
రిదా తజీన్ (విద్యానగర్)
ఫర్హీన్ బేగం (ఆసిఫ్ నగర్)
తస్మియా తహ్రీన్ (విద్యానగర్)
మహ్మద్ మంజూర్ (ఆసిఫ్ నగర్)
మహ్మద్ షాజైన్ అహ్మద్ (ముషీరాబాద్)
ఇజాన్ అహ్మద్ (ఆసిఫ్ నగర్)
హమ్దాన్ అహ్మద్ (లంగర్‌హౌస్)
హుజైఫా జాఫర్ సయ్యద్ (హిమాయత్‌సాగర్)
జహీన్ బేగం (ఆసిఫ్ నగర్)
షబానా బేగం (హిమాయత్‌సాగర్)
అనీస్ ఫాతిమా (మలక్‌పేట)
అమీనా బేగం (మలక్‌పేట)
సలీమ్ ఖాన్ (శాలిబండ)
మహ్మద్ షోయబ్ ఉర్ రెహమాన్ (షేక్‌పేట)
రయీస్ బేగం (గోల్కొండ)
ఉమైజా ఫాతిమా (ముషీరాబాద్)
సనా సుల్తానా (ముషీరాబాద్)
ఉజైరుద్దీన్ షేక్ (ముషీరాబాద్)
మెహ్రీష్ ఫాతిమా (ముషీరాబాద్).