calender_icon.png 17 November, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీ బస్సుప్రమాదంలో 45 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు

17-11-2025 01:33:06 PM

హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు(Saudi bus accident) ప్రమాదంలో 45 మంది చనిపోయారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(Hyderabad Police Commissioner) వెల్లడించారు. సౌదీ బస్సు ప్రమాదంపై సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... దగ్ధమైన బస్సులో 46 మంది యాత్రికులున్నారని తెలపారు. యాత్రికులు భారత్ నుంచి మక్కా, మదీనా యాత్రకు వెళ్లారు. ప్రమాదం నుంచి సోహెల్ అనే యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడని వెల్లడించారు. మొత్తం 54 మంది బృందం హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లింది.

నవంబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు టూర్ ప్లాన్ చేశారు. ఈ నెల 9న హైదరాబాద్ నుంచి యాత్రికులు ఉమ్రాకు బయలుదేరారు. మక్కా నుంచి 46 మంది యాత్రికులు మదీనాకు బస్సులో బయలుదేరారు. మదీనాకు 25 కి.మీ దూరంలో చమురు ట్యాంక్ ను బస్సు ఢీకొట్టింది.అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో బదర్-మదీనా(Badr-Madinah) మధ్య ముఫరహత్ ప్రాంతంలో బస్సు దగ్ధం అయింది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లారు. మరో నలుగురు వ్యక్తులు మక్కాలోనే ఉండిపోయారు. యాత్రికులు ఈనెల 23న జెడ్డా నుంచి తిరిగి రావాల్సిఉందని సజ్జనార్ పేర్కొన్నారు. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంపై సహాయక చర్యల కోసం తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 79979 59754, 99129 19545