calender_icon.png 4 December, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే వినోద్

04-12-2025 06:13:43 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దేవాలయానికి వెళ్లిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు అర్చన చేసి తీర్థ ప్రసాదాలను సమర్పించారు.

ఈ సందర్భంగా శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయనకు పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సత్కారం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ నాతరీ స్వామి, మాజీ జెడ్పిటీసీ రామ్ చందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.