calender_icon.png 4 December, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేబుల్ టెన్నిస్ లో సత్తాచాటిన విద్యార్థినిలు..

04-12-2025 06:11:03 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలలో ఐపీఎస్ పాఠశాల విద్యార్థినిలు ప్రతిభచాటారు. నవంబర్ 28 నుండి 30 తేదీలలో హైదరాబాద్ లోని మొయినాబాద్ ఫైర్ ఫ్యాక్స్ స్పోర్ట్స్, డిసార్ట్లో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ఇంటర్ డిస్టిక్ క్రీడల్లో పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఉమెన్స్ విభాగంలో ఈ వర్షిత, సిహెచ్ ఖుషి, శ్రీ చందన, హరిణి, కావ్య అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.

విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియలు గురువారం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి చూపి మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో రాణించాలని, క్రీడల వల్ల శరీ రానికి కావలసిన వ్యాయామం వల్ల ఆరోగ్యం దృఢంగా ఏర్పడతాయని, టేబుల్ టెన్నిస్ ఆడటం వల్ల మైండ్ చురుకుగా పనిచేయడం, ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, ఇక్బాల్, శివ, మమత ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.