calender_icon.png 23 August, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఎమ్మెల్యే పరామర్శ..

17-05-2025 04:37:26 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన అందులపల్లి సురేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని వెల్ నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) ఆసుపత్రికి చేరుకొని సురేష్ ను పరామర్శించారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాన్ని అడిగి తెలుసుకొని, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వెల్ నెస్ ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అనంతరం సురేష్ కుటుంబ సభ్యులకు వెడ్మ ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే వెంట లక్కారం మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, సురేష్ కుటుంబ సభ్యులు ఉన్నారు.