ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి
- సంగారెడ్డిలో ఇఫ్తార్ విందులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- హాజరైన మంత్రులు కోమటిరెడ్డి, దామోదర
సంగారెడ్డి, మార్చి 15 (విజయక్రాంతి): ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి సాధించడం, పేదలకు దానం చేయడం వంటి గొప్ప విలువలను రంజాన్ మాసం గుర్తు చేస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇచ్చిన ఇఫ్తార్ విందులో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఐక్యత, పరస్పర గౌర వం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తమని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరారు. మూసీ నదిపై కేటీ ఆర్ ప్రజంటేషన్ ఇస్తే నవ్వు వస్తుందని మం త్రి కోమటిరెడ్డి విమర్శించారు. నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో ఎన్ని ఇబ్బందులు పడ్డామో నల్గొండ ప్రజలకు తెలుసన్నా రు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి, నాయకు లు తోఫాజ అనంత కిషన్, కూన సంతోష్ పాల్గొన్నారు.




