calender_icon.png 9 February, 2026 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

09-02-2026 04:40:51 PM

దేవరకొండ,(విజయక్రాంతి): సోమవారం దేవరకొండ పట్టణంలో  15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి జువేరియా తబసుమ్ గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సతీమణి జ్యోతిప్రసన్న ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, దేవరకొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజ్, పారిశుద్ధ్యం వంటి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వార్డులో సమగ్ర అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, శ్రీధర్ రెడ్డి, మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్, సీనియర్ నేత నజీర్ అహ్మద్, కాసర్ల వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొర్ర గౌతమి, సమీర్, సద్దు మంగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.