calender_icon.png 17 July, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్నసేవలో ఎమ్మెల్సీ అద్దంకి, ప్రభుత్వ విప్ ఆది

17-07-2025 12:00:00 AM

రాజన్న సిరిసిల్ల: జూలై 16 (విజయక్రాంతి) రాజన్న సినిమాలో ఎమ్మెల్సీ అద్దం కి ప్రభుత్వ విప్ ఆది దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వా మిని బుధవారం రోజున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దర్శనానికి రాగా, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వాగ తం పలికినారు. ఇరువురు కలిసి రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కలు చెల్లించుకున్నారు.

వీరికి రాజన్న ఆలయ కార్యనిర్వాహక అధికారి రాధాబా యి నాగిరెడ్డి మంటపంలో శేష వస్త్రములు కప్పి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నవంబర్లో 1000 కోట్లతో వేములవాడ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేశారని తెలిపారు.

రాష్ట్ర ప్ర భుత్వం రాజన్న ఆలయానికి 150 కోట్లు కే టాయించడం జరిగిందని తెలిపారు. గత ప్ర భుత్వం రాజన్న ఆలయానికి ఏటి వంద కో ట్లు ఇస్తానని రాజన్న భక్తులను మోసం చే సిందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పేరిట రంగురంగుల బ్రోచర్లతో మాత్రమే చూపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో చేస్తున్నామని తెలిపారు.

మూడవ అభ్యర్థి లేకున్నా వారి వీడియోలో బ్రిడ్జి ఉన్నట్లు దాని పైనుండి వా హనాలు వెళ్లినట్లు చూపెట్టి రాజన్న భక్తుల ను, వేములవాడ ప్రజలను మోసం చేశారని తెలిపారు. అదే రాజన్న తంతేల మీద నా లగ్గం ఇక్కడ అయింది నా అత్తగారు కొదురుపాక అని ప్రజలను మభ్య పెట్టారు అని తెలిపారు.2014 కు ముందు రాజన్న ఆల యం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది అన్నారు.

ఒక్క పాత ఇటుక తీసి, ఒక్క కొత్త ఇటుక పెట్టలేదు అన్నాడు. గతంలో పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మా టకు కట్టుబడి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు అని, చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. 35 కోట్ల తో అన్నదాన సత్రం, 47 కోట్లతో రోడ్డు వెడ ల్పు, ఆరు కోట్ల రూపాయలతో మూడవ బ్రిడ్జికి, 76 కోట్లతో ఆలయ అభివృద్ధి, మూ ల వాగులో, గుడి చెరువులో మురికి నీరు కలవకుండా9 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు.పట్టణాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి సమాంతరంగా చేస్తున్నాం.

ముఖ్యమంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సం బంధించిన మంత్రుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజన్న ఆలయ పరిధిలో 50 ఎకరాలతో సుశీలమైన గోశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. మొన్నటి క్యాబినెట్లో వేములవాడ గోశాల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అవినాతన గోశాల నిర్మా ణానికి క్యాబినెట్లో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గానికి రా జన్న భక్తుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

రాజన్న ఆలయం, పట్టణ అభి వృద్ధిలో అందరి సూచనలు, సలహాలతో ముందుకు పోతున్నాం అన్నారు. శృంగేరి పీఠం వారి ఆలోచనకు అనుగుణంగా వారి అనుమతులతో త్వరలోనే భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రాజన్న సన్నిధిలోకి వచ్చే భక్తులకు శీఘ్రమైన దర్శనం కలిగేలా సకల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధు లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలోపాల్గొన్నారు.