calender_icon.png 18 July, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరు వ్యాపారులకు చేయూతనిస్తాం

17-07-2025 04:37:41 PM

ఎమ్మెల్యే మురళి నాయక్ హామీ

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలో ఇందిరాగాంధీ, నెహ్రు సెంటర్లలో నిర్వాసితులైన చిరు వ్యాపారులకు సమీకృత మార్కెట్ లో అవకాశం కల్పించాలని మున్సిపల్ సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారు. గురువారం ఉదయం నిర్వాసితులైన చిరు వ్యాపారులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి వారి ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాధితులతో కలిసి ఇందిరాగాంధీ, నెహ్రు సెంటర్, సమీకృత మార్కెట్ ను సందర్శించి చిరు వ్యాపారులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకు మంజూరు చేయాలని కోరగా, నిలువ నీడలేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.