06-11-2025 09:04:01 PM
మిడ్జిల్: చెకుముకి సైన్స్ సంబరాల 2025 గోడ పత్రికను జడ్.పి.హెచ్.ఎస్ మిడ్జిల్ మండల పరిధిలో అయ్యవారిపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే పరీక్షకు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులు 8 9 10వ తరగతి విద్యార్థులందరూ పరీక్ష రాసేలా చూడాలని టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సి వెంకటయ్య సూచించారు.
వారు మాట్లాడుతూ 1988 ఫిబ్రవరి 28 ఊరు పోసుకున్న జెవివి గత 36 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలతో తెలుగు ప్రజల జీవితంలో విడదీయలేని భాగంగా పెనువేసుకుపోయిందని సైంటిస్టులు డాక్టర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇతర రంగాలకు చెందిన వృత్తి నిపుణులు 40,000 మంది సభ్యులు ఉన్న అతిపెద్ద సైన్స్ ప్రచార సంస్థగా రాష్ట్రంలో ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీశైలం, రాజేందర్ గౌడ్, అనంతరెడ్డి, మహేంద్రమ్మ, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.