calender_icon.png 6 November, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరణ

06-11-2025 08:50:22 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జాజిరెడ్డిగూడెం మండల నూతన ఎంపీడీఓగా పల్లపు ఝాన్సీ గురువారం బాధ్యతలు స్వీకరించారు.గత 8నెలలుగా ఇంచార్జీ ఎంపీడీఓగా విధులు నిర్వహించిన ఎంపీఓ గోపి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమై ఎంపీడీఓ హోదా సాధించిన ఝాన్సీకి ఇది తొలి పోస్టింగ్. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు, శాలువాలతో శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రామకృష్ణ, ఏపీఓ ఉపేందర్,ఈసీ మహేష్,సీఓలు సుధీర్,సంతోష, నవీన్,జూనియర్ అసిస్టెంట్ శిల్పిక,సాయి ప్రదీప్, టీఏ నాగమణి,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.