calender_icon.png 6 November, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ విఠలేశ్వర ఆలయంలో ఘనంగా ముగిసిన కార్తీక మాసోత్సవాలు

06-11-2025 08:35:59 PM

👉 నెల రోజులుగా ప్రతిరోజు తెల్లవారుజామున కొనసాగిన కాకడ హారతి 

👉 ఏడు రోజులపాటు ఆలయంలో కీర్తన భజన కార్యక్రమాలు 

👉 చివరి రోజు అయిన గురువారం శ్రీకృష్ణ జననం, ఉట్టి కొట్టే కార్యక్రమం, గ్రామంలో పల్లకి ఊరేగింపు 

👉 ఈ రాత్రి అన్నదాన కార్యక్రమంతో ముగిసిన వేడుకలు 

కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో తెలుగింటి పండరీపురంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ విఠలేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఏడు రోజులపాటు ఘనంగా సాగాయి. చివరి రోజైన గురువారం ఆలయంలో విట్టల రుక్మిణి విగ్రహాలకు అభిషేకం పుష్పార్చనతో పాటు నూతన పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం కాకడ హారతి జరిగింది. భక్తులు ఆలయానికి చేరుకుని పాండురంగడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఏడవ రోజు అయిన గురువారం విట్టల్ గురూజీ మహారాజ్ చే కాలా కీర్తన అనంతరం సాయంత్రం వేళలో శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణుని వేషధారణలో చిన్నారి ఉట్టి కొట్టే కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అనంతరం భజనలు,  మేళతాళాలతో  పల్లకి ఊరేగింపు జరిగింది. ఆలయంలో అన్నదాన కార్యక్రమం తో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆలయ చైర్మన్ పెంటాజీ, ఆలయ పూజారులు ప్రమోద్, రాజు మహారాజ్, పుప్పాల పిరాజు, బచ్చు ప్రసాద్, ప్రకాష్, ఆర్ వాసుదేవ్, రాజన్న, గ్రామస్తులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.