06-11-2025 08:37:58 PM
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం (విజయక్రాంతి): పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామంలో శిక్షణ ఐఏఎస్ అధికారుల బసకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం స్వయంగా పరిశీలించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ముస్సోరి నుండి వస్తున్న శిక్షణ ఐఏఎస్ అధికారుల బృందం లెంకలగడ్డ ప్రాథమిక పాఠశాలలో బస చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాల భవనం, వసతి, విద్యుత్, నీరు, పారిశుధ్య కార్యక్రమాలు, భద్రత వంటి అంశాలపై అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు స్థానికంగా సమన్వయం చేసుకొని ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. తహశీల్దార్ అనిల్, ఎంపిడివో సాయి పవన్, ఎంఈవో ప్రకాశ్‌రెడ్డి మరియు సంబంధిత శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.