06-11-2025 12:00:00 AM
కార్డెన్ సర్చ్‌లో అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు
అచ్చంపేట, నవంబర్ 5: వాహనదారులు తప్పనిసరిగా అవసరమైన ధ్రువపత్రాలను తమ వద్ద అందుబాటులో ఉంచుకోవాలని అచ్చంపేట పోలీస్ డిఎస్పి పల్లె శ్రీనివాసులు సూచించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం అచ్చంపేటలోని శివసాయినగర్ లో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (కార్డెన్సర్చ్ ప్రోగ్రాం) లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 60 టూ వీలర్స్, ఒక కారు, ఒక టాటా ఏసీని సీజ్ చేశారు. ప్రజలందరూ వ్యాలీడ్ డాక్యుమెంట్స్ కలిగిన వాహనాలు నడపాలని.. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని డిఎస్పి ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో అచ్చంపేట సీఐ నాగరాజు, ఎస్త్స్ర కే.సద్దాం హుస్సేన్, సబ్ డివిజన్ ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్ దాదాపు 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.