calender_icon.png 6 November, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయానికి సింహవాహనం అందజేత

06-11-2025 08:54:58 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రూ.2 లక్షలు విలువచేసే సింహవాహనాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని పర్సాయపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహస్వామి భక్తుడు, దాత కొప్పు నర్సయ్య రూ.2 లక్షలతో ప్రత్యేకంగా తయారు చేయించిన సింహవాహనాన్ని గురువారం ఆలయంలో ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రాంబాబు అయ్యంగార్, పవన్, భక్తులు వీరారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.