calender_icon.png 5 January, 2026 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాత ఆప్యాయతకు ముద్గురాలైన కవిత

03-01-2026 07:28:15 PM

తాతా బాగున్నావా.. బాగున్నాను మంచి రోజులు పోయాయమ్మ

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన పరిశీలన వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, మధురమైన అనుభూతి కలిగింది. ప్రభుత్వ దవాఖానకు వచ్చిన ఓ తాత( వృద్ధుడు) బాగున్నావా తాత అని ఆమె ఆప్యాయత అడగగా, అమ్మ మీరు బాగున్నారా, కెసిఆర్ బిడ్డను, కేసీఆర్ సార్ బాగున్నారా, అంటూ ఆప్యాయతో, తన చేతిని ఆమె దవడమీదికి తీసుకొని రావడంతో, అందర్నీ ఆశ్చర్యాన్ని గురి చేసింది. అమ్మ మంచి రోజులు పోయాయి, ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది, మళ్లీ మంచి రోజులు రావాలని, ఆమెని వేడుకోగా, తాతా మళ్ళీ మంచి రోజులు వస్తాయని, ఆమె చమత్కరించింది.