03-01-2026 07:32:16 PM
జిల్లా వైద్యా శాఖ అధికారి బి.నాగలక్ష్మి
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సావిత్రిబాయి స్ఫూర్తితో విద్యార్థులకు అన్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారీ బి.నాగలక్ష్మి అన్నారు. దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ... సావిత్రిబాయి పూలే వంటే మహోన్నత వ్యక్తుల జీవితాలు ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని బాగు చేసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు.
అటువంటి స్ఫూర్తిని నింపటానికి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి మాట్లాడుతూ... ఈరోజు మహిళా ఉపాధ్యాయులను చూస్తుంటే తనకు చిన్ననాడు చదువు చెప్పిన ఉపాధ్యాయులే గుర్తొస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బోధన కేవలం వృత్తి మాత్రమే కాదని అది ఒక సామాజిక బాధ్యత అని ఆ బాధ్యతను నిర్వహించడం ఉపాధ్యాయులుగా అందరి కర్తవ్యం అని ఉద్భోదించారు.
ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా 2026వ సంవత్సరంలో పదవి విరమణ పొందబోతున్న 44 మంది మహిళా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి గారి సమక్షంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు కొదుమూరు సత్యనారాయణ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు అంకినీడు ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, వివిధ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.