10-05-2025 12:32:43 AM
భారత ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి అండగా నిలవాలి..
ర్యాలీలో పాల్గొన్న వందల పదిమంది టిఆర్‌ఎస్ శ్రేణులు
ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ లో ఎమ్మెల్సీ కవిత.
ఎమ్మెల్యే ముఠా గోపాల్..
ముషీరాబాద్,(విజయక్రాంతి): భారతదేశానిది ధర్మ యుద్ధం కాబట్టి ప్రపంచ దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. భారత ప్రజలందరూ ఒకే తాటి పైకి వచ్చి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఇందిరా పార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ఉన్నలాదిమంది టిఆర్‌ఎస్ శ్రేణులు హాజరై విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, టిఆర్‌ఎస్ నాయకులు గజ్జల నగేష్ యువ నాయకుడు ముఠా జై సింహ, జాగృతి నేతలు, టిఆర్‌ఎస్ పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ జెండాలను చేతగోని భారత్ వీర సైనికులకు వందనాలు అంటూ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ చిత్రపటానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని వారు కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞత ప్రదర్శించి అందాల పోటీలను ఐపీఎల్ మాదిరిగా వాయిదా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది టిఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.