10-05-2025 12:34:48 AM
వైకల్యం లక్ష్యసాధనకు అడ్డుకాదు
ఉన్నత చదువుల కోసం సహకారం అందిస్తాం
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
మునిపల్లి, మే 9: కాళ్లు, చేతులు కోల్పోయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పదో తరగతి పరీక్షల్లో 86 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన కంకోల్ గ్రామానికి చెందిన మ ధుకుమార్ ను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.
వి ద్యార్థులందరికీ మధు కుమార్ స్ఫూర్తిదాయాకమన్నారు. పదవ తరగతి లో ఎంతో కష్టపడి ఉత్తమమైన మార్కులు సాధించావని ఇదే స్ఫూర్తిగా ఉన్నత స్థాయి విద్యలో కూడా కష్టపడాలని అన్నారు. మధు కుమార్ ఉన్నత చదువుల కోసం ఎలాంటి సహకారం అయినా అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా మధు కుమార్ కు, వారి తల్లిదండ్రుల కు శాలువా, పూల బొకే తో సత్కారం చేసి మధు కుమార్ కు కంప్యూటర్ అందజేశారు. ఇలావుండగా కంకోల్ గ్రామాని కి చెందిన మధుకుమార్. కరెంటు షాక్ బారిన పడి మరణాన్ని జ యించాడని, ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఏకంగా 86 శాతంతో అంటే 500 మార్కులకు గాను 430 మార్కులు సాధించి వైకల్యం శరీరానికే కానీ లక్ష్యసాధన కాదని నిరూపించాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు,మధు కుమార్ తల్లిదండ్రులు, కంకోల్ పాఠశాల ఉపాధ్యాయులుపాల్గొన్నారు.