calender_icon.png 30 October, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇతనాల్ పరిశ్రమపై రైతుల అభ్యంతరం

22-09-2024 08:31:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): దిల్వార్పూర్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమపై రైతులు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని పెన్షనర్ల భవనంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. విత్తనాలు పరిశ్రమ వల్ల తమకు నష్టం జరుగుతుందని రైతులు పోరాటం చేస్తున్నారని వారికి పూర్తిగా సహకారం అందిస్తామని తెలపారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఉద్యమకారులు పాల్గొన్నారు.