9 April, 2026 | 2:01 AM

ఆర్టీసీ ఎండీని కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

09-04-2026 12:10 AM

పూలే జయంతిని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించాలని వినతి

హైదరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): టీజీఎస్‌ఆర్టీసీ బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ (330/2౦26) గౌరవాధ్యక్షుడు, ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం ఆర్టీసీ వీసీ అండ్ ఎండీని బస్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ నెల 11న మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతిని ఆర్టీసీ కళ్యాణ మండపంలో అధికారికంగా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ మల్లన్న కోరారు.

ఇందుకు ఆర్టీసీ వీసీ, ఎండీ సానుకూలంగా స్పందించారు అదేవిధంగా రాష్ట్ర బీసీ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో వీసీ అండ్ ఎండీని మాట్లాడించి ఈ కార్యక్రమానికి మద్దతు పొందారు..ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవుళ్ళ సమ్మయ్య, సతీష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పున్న హరికిషన్ (జనరల్ సెక్రటరీ), సంపత్ ముదిరాజ్ (ప్రెసిడెంట్), మహమ్మద్ సాజిద్ (స్టేట్ జాయింట్ సెక్రటరీ), దుర్గేష్ గౌడ్ (రాష్ట్ర ప్రచార కార్యదర్శి), సురేష్ (రాష్ట్ర కార్యదర్శి), ఆంజనేయులు (రాష్ట్ర కార్యదర్శి)తో పాటు ఇతర కమిటీ సభ్యులు, బీసీ ఉద్యోగులు మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.