14-05-2025 12:21:52 AM
పటాన్ చెరు, మే 13 : బీరంగూడ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దంపతులు మంగ ళవారం దర్శించుకున్నా రు. ఆలయ కమిటీ చైర్మ న్ సుధాకర్ వారికి స్వాగ తం పలికారు. ఆలయ ఈవో శశిధర్ గుప్తా ఎమ్మెల్సీ దయాకర్ దంపతులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దయాకర్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.