calender_icon.png 14 May, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జొన్నల కొనుగోలు కేంద్రం సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

14-05-2025 12:23:24 AM

నారాయణఖేడ్, మే 13: మనూరు మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఏర్పాటుచేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

కొనుగోలు కేంద్రం కు వచ్చిన జొన్నలను సమయానికి కొనకపోవడంతో వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కెట్ కమిటీకి వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలని.

వర్షానికి తడిసిన జొన్నలను సైతం కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కాగా రైతుల నుండి రెండు నుండి ఐదు కిలోల వరకు తరుగు పేరుతో ధాన్యాన్ని తగ్గించడం సరికాదని అన్నారు. తరువు తీయకుండానే ధాన్యాన్ని సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు విట్టల్ రావు పాటిల్, నాయకులు నాగేందర్ రావు, మాజీ ఎంపిటిసి ముజామిల్ , మన్నాన్, నర్సింలు ఉన్నారు.