calender_icon.png 6 July, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ డ్రైవ్ ద్వారా 130 మొబైల్ ఫోన్ల రికవరీ

05-07-2025 08:28:35 PM

బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి మొబైల్   పొందవచ్చు

మొబైల్ రికవరీలలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానం

జిల్లా ఎస్పీ  యం.రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సి ఈ ఐ ఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరికి  గురైన 130  మొబైల్ ఫోన్లను (సుమారు 17 లక్షల విలువగల) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుందన్నారు. మొబైల్ రికవరీలలో రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే, కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని అని తెలిపారు.  సెల్ ఫోన్ పట్ల  అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేయాలని తెలిపారు. 

సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త సిమ్ కార్డుతీసుకోవాలన్నారు.  పోయిన మొబైల్ ఫోన్ల IMEI వివరాలు CEIR వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వలన  పోగొట్టుకున్న మొబైల్  సులబంగా దొరికే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్  శ్రీధర్ ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ బాలరాజు, 10 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 15 రోజులలో ఈ ప్రత్యేక టీం అధికారులు 130 సెల్ పోన్ లను రికవరీ చేయడం జరిగిందన్నారు. మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన  టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.