05-07-2025 08:25:46 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థిని సాత్విక(16) బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందింది. విశ్వనాథుల పూర్ణచందర్ కవితల కూతురు సాత్విక అనారోగ్యానికి గురికావడంతో మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke)కు గురై మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. వారిది నిరుపేద కుటుంబం తండ్రి కొద్ది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.