05-07-2025 08:29:52 PM
తుర్కయంజాల్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై క్రూరమైన దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, ఈ అమానవీయ సంఘటనలతో దేశం సిగ్గుతో తలదించుకుంటోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్(CITU State Vice President Bhopal) మండిపడ్డారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలో కేవీపీఎస్ జిల్లా స్ధాయి సామాజిక శిక్షణ తరగతులు నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్ అధ్యక్షతన ఈ క్లాసులు జరిగాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాల్ మాట్లాడుతూ... దేశంలో జరుగుతున్న అమానవీయ దాడులను అందరూ ఐక్యంగా ఖండించాలన్నారు. కార్మికుల, కర్షకుల హక్కులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈనెల 9న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని వెల్లడించారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షలు బోడ సామేల్, లాయర్ అరుణ్ కుమార్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. ఆనంద్, డి.పెద్దయ్య, జిల్లా నాయకులు వీరేశం, బాబు, జయ, ఆశీర్వాదం, యాదగిరి, లక్ష్మయ్య, యాదయ్య, నవీన్ గౌడ్, జి. మహేష్, స్కైలాబ్ తదితరులు పాల్గొన్నారు.