calender_icon.png 15 November, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21,193 మొబైల్స్ రికవరీ

29-07-2024 02:40:54 AM

దేశంలోనే తెలంగాణ రెండో స్థానం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28(విజయక్రాంతి): మొబైల్స్ రికవరీలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ౨౦౭ రోజుల్లో ౨౧,౧౯౩ మొబైల్స్‌ను పోగొట్టుకున్న వారికి అందజేశారు. మొబైల్ దొంగతనాలను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్‌ను ఉపయో గించి రికవరీ చేశారు. 2024 జనవరి 1 నుంచి జూలై 25 వరకు 207 రోజుల్లో 21,193 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. 35,945 మొబైల్స్ రికవ రీతో  కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది.

రాష్ట్రంలో ఏప్రిల్ 19, 2023న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పోర్టల్ రాష్ట్రంలోని 780 పోలీస్ స్టేషన్లలో అమలు చేస్తున్నారు. జంట నగరాల్లోని మూడు కమిషనరేట్లలో రోజుకు సగటున 76 మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తుండటం గమనార్హం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,808 ఫోన్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2,174 ఫోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,030 ఫోన్లు రికవరీ చేశారు. మొబైల్ ఫోన్లు పోగోట్టుకున్న, చోరీకి గురైనా  www.ts police.gov.in, www.ceir.gov.in వెబ్‌సైట్‌లలో ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు కోరారు.