calender_icon.png 5 December, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

05-12-2025 04:25:21 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ ఆదర్శ పాఠశాల (model school) విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరపున రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న శుక్ర వారం తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏ అక్షిత్, పి అశ్విని, ఎం సుష్మిత, పి స్నేహచైత్రలు పాల్గొంటారన్నారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చన్న తో పాటు డిఐఈఓ (DIEO) అంజయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ కళాశాల క్రీడల సమాఖ్య కార్యదర్శి బి. బాబురావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పిడి (PD) ఎన్ సుదీప్, కళాశాల అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.