calender_icon.png 5 December, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా రమేష్ నాయక్ నామినేషన్

05-12-2025 05:36:33 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలోని లాలితండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి బానోతు రమేష్ నాయక్ శుక్రవారం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టి, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో ముందుకు వచ్చిన బానోతు రమేష్ నాయక్ కు గ్రామస్తులు, కార్యకర్తలు, యువత, పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. నామినేషన్ కార్యక్రమం ఉత్సహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పరిపాలన నా లక్ష్యం, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్,బాలు నాయక్, గ్రామ ప్రజలు, కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.