calender_icon.png 5 December, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

05-12-2025 04:51:30 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని అంకత్ పల్లె గ్రామానికి చెందిన ఎంబడి  రాజలింగు(51) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడని ఎస్ఐ గోపతి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గత నెల ఐదవ తేదీన ఉదయం ఇంటి నుండి వాకింగ్ కు  బయలుదేరి ఈనాడు ఆఫీస్ వరకు వెళ్లి తిరిగి వస్తుండగా లక్షెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపుకు వెళుతున్న కారు వెనకాల నుండి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడ్డ రాయలింగును స్థానికులు కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుని భార్య ఎంబడి  భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.