calender_icon.png 4 August, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు

04-08-2025 01:24:26 AM

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు గంటకు 30 కి.మీ. వేగంతో వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.

ఇవాళ నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, రంగారెడ్డి, హై దరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.