04-08-2025 01:20:15 AM
ప్రారంభించిన మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
నల్గొండ రూరల్ ఆగస్ట్ 3: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘మహా సంపర్క్ అభియాన్‘ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్గొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ప్రారంభించిన అనంతరం ,గడప గడపకు వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,
పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేందుకు ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలన్నారు.
గ్రామ స్థాయిలోనూ బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ , తదితరు లు పాల్గొన్నారు.