04-07-2025 01:38:30 AM
సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు
ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో వచ్చిన మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డా రు.
ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా కార్యదర్శి విస్సా కిరణ్, టి.సాగర్, ప్రసాద్, శోభన్, బిక్షపతి, జక్కుల వెంకటయ్య, పశ్యపద్మ లతో కలసి ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న తలపెట్టిన అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అధికారంలోకి వచ్చాక కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ విస్మరించారని అన్నా రు. నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ పాలసీలో కనీస మద్దతు ధర ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. అభివృద్ధి పేరిట వ్యవ సాయ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
ప్రధాన మంత్రి ఫజల్ భీమా యోజన పథకం రైతుల కంటే, కంపెనీలకే లబ్ది జరుగుతుందని ఆరోపించారు. అమెరికా దేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు విఘాతం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా విధానాలను ప్రతి ఒక్కరు ఖండించాలని, అఖిల భారత సమ్మెలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.