04-07-2025 01:37:01 AM
టీఆర్‌ఎస్-డీ అధ్యక్షుడు నరాల సత్యనారాయణ
ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్టుపై వ్యతిరేకంగా ఈనెల 19న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సమితి డెమోక్రెటిక్ (టీఆర్‌ఎస్-డి) వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీలు గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీదుగా పెన్నా బేసిన్ కు మల్లించినందుకు గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టును సుమారు రూ. 80 వేల కోట్లలో చేపడుతుందని ఆరోపించారు. త్వరలో జరుగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికకు టీఆర్‌ఎస్ డీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యావంతురాలు కంచర్ల మంజూ షను ప్రకటించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు శంకర్ గౌడ్, రాజు, శ్యామల, శివప్రసాద్, స్వరూప, నాగభూషణం, రేఖ, శారద, శ్రీలత, లక్ష్మి, సరిత, సైదమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.