21 April, 2026 | 3:46 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

దేశానికి మోదీ ఎంతో చేశారు

12-05-2024 02:34 AM

బీజేపీ జాతీయ నేత వినయ్ సహస్రబుదే 

హైదరాబాద్, మే 11 ( విజయక్రాంతి): పదేళ్లలో దేశానికి ప్రధాని మోదీ చాలా చేశారని, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ వినయ్ సహస్రబుదే పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా, సబ్ కా సాత్, సబ్ కా విసాక్ లాంటి అంశాల్లో మోదీ తన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. వీటిని మోదీ ఒక కార్యక్రమంలా చూడలేదని యజ్ఞంలా చేశారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మోదీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. బంజార హిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో శనివారం మేధావుల సదస్సు జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినయ్ సహస్రబుదే హాజరై మాట్లాడగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ అభ్యర్థి జీ కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. మోదీ కృషి వల్ల ప్రపంచ యవనికపై భారత్ శక్తి పెరిగిందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలకు సాయం చేసి భారత్ కీర్తిని మోదీ పెంచారన్నారు. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ చేసిన కామెంట్లు ప్రపంచ నేతలను ఆకర్షించాయన్నారు. 

ఒకప్పుడు ఇండియా అంటే తాజ్‌మహల్ గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు భగవద్గీత గుర్తుకొస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ, దేశాభివృద్ధి కోసం నీతి నిజాయితీతో అంకితభా వంతో పనిచేస్తామని, బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు.