calender_icon.png 14 August, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత ప్రజల ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న మోడీ

13-08-2025 07:48:23 PM

భద్రాచలంలో కేంద్ర కార్మిక, రైతు, కూలీ సంఘాల ఆధ్వర్యంలో మోడీ,డోనాల్డ్ ట్రంప్ ల దిష్టిబొమ్మ దగ్ధం

భద్రాచలం (విజయక్రాంతి): భారత ప్రజల ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్ర మోడీ సామ్రాజ్యవాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, కూలీ సంఘాలు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్ ల దిష్టిబొమ్మలను భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్ నందు బుధవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు(CITU Convener Bandaru Sharath Babu) అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ నర్సారెడ్డి, యునైటెడ్ కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షులు కెచ్చల రంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి, ఏఐటీయూసీ పట్టణ నాయకులు మారెడ్డి శివాజీ, ఐఎన్టియుసి డివిజన్ నాయకులు ఎస్ శ్రీనివాసరావులు మాట్లాడారు. అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశము నుండి దిగుమతు చేసే సరుకులపై టారిఫ్ ల పేరుతో అధిక సెస్సులు వేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నా భారత ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు.

అమెరికా దిగుమతి చేసుకుంటున్న భారత వస్తువులపై 50 శాతం పన్ను వేస్తామని చెబుతుందని అదే జరిగితే భారతదేశం నుండి ఎగుమతి చేసే అన్ని రకాల వస్తువులు ధరలు పెరుగుదల జరుగుతుందని దానివల్ల ఎగుమతులు చేసేటటువంటి వ్యవసాయ ఆధారిత పంటలు, పారిశ్రామిక రంగం తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.భారత ప్రజల ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టేందుకు మోడీ సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నకిరికంటి నాగరాజు, రాయల రాములు, మురళీకృష్ణ, ఏఐఎఫ్ నాయకులు సాధన పల్లి సతీష్ కుమార్, గుంజ రామారావు, పి డి ఎస్ యు డివిజన్ నాయకులు శివ ప్రశాంత్, టి యు సి ఐ నాయకులు భాస్కర్, ఐ ఎన్ టి యు సి నాయకులు మాధవరావు, చందర్రావు, రామ్మోహన్ రెడ్డి, సాంబయ్య, ఐద్వా నాయకులు యుస్తెల జ్యోతి, సత్యవతి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, ఆవాజ్ పట్టణ నాయకులు ఎస్ డి ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.