calender_icon.png 14 August, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

13-08-2025 07:39:50 PM

జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్..

రాజాపూర్: విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహార భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్(District Additional Collector Shivendra Pratap) అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు, మండలంలోని కుచర్ కల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంట గదులను పరిశీలించారు. వంట గది పరిశుభ్రంగా వంట సిబ్బందికి సూచించారు. అలాగే కుచర్ కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. మండల కేంద్రంలో భవిత కేంద్రంలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న తనేష్ ను విధుల నుండి తొలగించాలని డీఈఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ లక్ష్మీదేవి,ఎంపిఓ వెంకట్రాములు, అధికారులు పాల్గొన్నారు.