12-06-2025 12:43:31 AM
భద్రాద్రికొత్తగూడెం, జూన్ 11, (విజయ క్రాంతి): మధ్యభారతంలోని అమాయక ఆదివాసీ గిరిజనులపై ప్రధాని మోడీ, హొమ్ మంత్రి అమిత్ షా యుద్ధం ప్రకటించి హత్యాకాండకు పాల్పడుతోందని, ఈ చర్యలను దేశ ప్రజలు ముక్తకంఠంతో కండించాలని సిపిఐ భద్రాద్రి జిల్లా కార్య దర్శి ఎస్ కె సాబీర్ పాషా, న్యూ డిమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, సీపీఎం జిల్లా నాయకులు రేపాకుల శ్రీనివాస్,టిజెఎస్ జిల్లా నాయకులూ మల్లెల రామనాధం, మాస్ లైన్ జి ల్లా నాయకులు జాటోత్ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు గౌస్ పాషా, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు అనుదీప్, బిఎస్పి జిల్లా నాయకులు కురుమళ్ల శంకర్, టిపిఎఫ్ జిల్లా నాయకులు ప్రశాంత్ పి లుపు నిచ్చారు.
బుధవారం ’శేషగిరిభవన్’లో జరిగిన వామపక్ష, విపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో నాయకులు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని, ఆదివాసీ చట్టాలను కేంద్రప్రభుత్వం ఉల్లంగించి ’ఆపరేషన్ కగార్’పేరుతో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని, అమాయక ఆదివాసీ బిడ్డలను పొట్టనపెట్టుకుంటోందని ఆరోపించారు.
దేశ రక్షణకోసం సరిహద్దుల్లో ఉం చాల్సిన సైనికులను ప్రజలకోసం పోరాడుతున్న మావోఇస్టులపైకి ఉసిగొల్పుతూ హత్యలకు ప్రేరేపిస్తోదని విమర్శించారు. 2026 నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా ప్ర కటించడాన్ని దేశ ప్రజలు కోరుకోవడం లేదని, పేదరిక నిర్మూలన, పూర్తి స్థాయిలో విద్య, వైద్యం, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని బాధ్యతగా కేంద్ర పాలకులు ప్రకటిస్తే ప్రజలు స్వాగతిస్తారని అన్నారు.
అటవీ ప్రాంతంలో ఖనిజ సంపదకు కాపలాదారులుగా ఉన్న గిరిజనులను, మావోయిస్టులను మట్టిబెట్టి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ’ఆపరేషన్ కగార్’కు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు. తక్షణమే ’ఆపరేషన్ కగార్’ పేరుతో జరుపుతున్న హత్యాకాండకు స్వస్తి చెప్పి శాంతి చర్చలను కేంద్రం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, వంగ వెంకట్, భూక్యా శ్రీనివాస్, కె రత్నకుమారి, ఫహీమ్, కె ఉమర్, కల్తీ వెంకటేశ్వర్లు, సతీష్, గోపాల్ రావు, దేవదానం, భూక్యా రమేష్, కృష్ణయ్య, సంజీవ్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.