calender_icon.png 14 July, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు పనులకు శ్రీకారం

12-06-2025 12:42:39 AM

ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి

చిన్న చింతకుంట, జూన్ 11 : పల్లె ప్రజల ఆరాధ్య దైవంగా కొలవబడుతూ పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూ ర్తి స్వామి దేవస్థానం వద్ద ఎలివేటేడ్ కారిడార్‌తో కూడిన ఘా ట్ రోడ్ నిర్మాణ పనులకు  దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూ దన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులు,వికలాంగుల భక్తులకు కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం వలన ఆ సమస్యలు తొలుగుతాయని తెలిపారు.

కురుమూర్తి స్వామి భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి రూ 110 కోట్ల నిధులు మంజూరు చేయడంతో, నేడు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. దేవాలయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, కాటేజెస్, కళ్యాణమండపంతో పాటు తదితర పనులకు రూ 60 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, శ్రీ కురుమూర్తి స్వామి ఆశీస్సులతో ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ ఆలయ అభివృద్ధికి అంకితభావంతో ప ని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి , టీపీసీ సీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ రెడ్డి , దేవాలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, దేవరకద్ర మా ర్కెట్ యార్డ్ చైర్మన్ కథలప్ప, టీపీసీసీ నాయకులు దొమ్మటి సాంబయ్య, భాస్కర్ యాదవ్ ,కురుమూర్తి దేవస్థానం పాలకమండలి సభ్యులు, ఆర్ అండ్ బి అధికారులు తదితరులుపాల్గొన్నారు.